ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువుకు భారమై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఫరూక్ నగర్‌కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని మృతిపట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-
ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.
— Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.
ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha
">ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.
— Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020
ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.
ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6haఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.
— Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020
ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.
ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha
"ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్డౌన్ ద్వారా.. భాజపా ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది." అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఫరూక్‌నగర్‌లో నివాసం ఉండే మెకానిక్ శ్రీనివాసరెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య రెడ్డి ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో ఉచిత సీట్ సాధించింది. అగ్రవర్ణ విద్యార్థి కావడం వల్ల ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల హాస్టల్లో ఉండి చదవడం పెనుభారంగా మారింది. మానసికంగా బాధపడిన ఈ విద్యార్థిని ఈ నెల 3న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇదీ చదవండి: విద్యార్థిని ఆత్మహత్య.. ఆర్థిక పరిస్థితులే కారణం