ETV Bharat / state

Addanki Dayakar: 'ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన'

అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు 'విద్యార్థి- నిరుద్యోగ సైరన్' పేరిట కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పష్టం చేశారు.

Addanki Dayakar
Addanki Dayakar
author img

By

Published : Sep 29, 2021, 4:21 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వివరించారు. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు 'విద్యార్థి- నిరుద్యోగ సైరన్' పేరిట కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాడనుందన్నారు. అందులో భాగంగా దిల్​సుఖ్​నగర్​ రాజీవ్ చౌక్ నుంచి ర్యాలీగా ఎల్బీనగర్ రింగ్ రోడ్​లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్టోబర్ 2న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగ జంగ్ సైరన్​ను విజయవంతం చేయాలని దయాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెల్యా నాయక్, మల్​రెడ్డి రాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీచూడండి: Manikonda Manhole Incident: రజినీకాంత్​ కుటుంబానికి ప్రభుత్వ పరిహారం.. బాధ్యులపై చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.