రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రంగారెడ్డి జిల్లా యాచారంలోని తన నివాసంలో ఒక రోజు దీక్ష చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని కోదండ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఎల్లప్పుడు అన్నదాతలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కర్షకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.