MP Komati reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవీ తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటీపడి భంగపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డితో అంటిముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీతో సమావేశమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి వైఖరిని రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర నేతలతో సమావేశమైనప్పుడు రాహుల్‌తో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఉండటంతో పార్టీ నాయకుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో స్టార్ క్యాంపెయినర్‌గా సినీనటి విజయశాంతి కొనసాగారు. ప్రస్తుతం ఆమె భాజపాలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో ఎంపీ కోమటిరెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా నియామకం పట్ల స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ట్విటర్ ద్వారా అభినందించారు. ఈ నియామకంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలియచేశారు.
-
I thank @INCIndia President Smt Sonia ji Sri @RahulGandhi & Smt @priyankagandhi ji for entrusting me a new responsibility as "Star Campaigner" of @INCTelangana pic.twitter.com/8iUFPfE3X1
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">I thank @INCIndia President Smt Sonia ji Sri @RahulGandhi & Smt @priyankagandhi ji for entrusting me a new responsibility as "Star Campaigner" of @INCTelangana pic.twitter.com/8iUFPfE3X1
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) April 10, 2022I thank @INCIndia President Smt Sonia ji Sri @RahulGandhi & Smt @priyankagandhi ji for entrusting me a new responsibility as "Star Campaigner" of @INCTelangana pic.twitter.com/8iUFPfE3X1
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) April 10, 2022
దళితుల భూములు లాక్కుంటున్నారు: తెరాస పాలనలో దళితుల భూములను లాక్కుంటున్నారని ఎంపీ కోమటిరెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ పరిధిలోని కుంట్లూర్‌లో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను తెరాస నాయకులు ఆక్రమించే పనిలో ఉన్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు కూల్చేశారని దళితులు చేపట్టిన నిరవధిక దీక్షలో ఎంపీ పాల్గొన్నారు. ఈ దీక్షలో ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మద్దతు బాధితులకు ప్రకటించారు. దళితుల జోలికి వస్తే వారి తరఫున పోరాటం చేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.
ఇదీ చూడండి: వడ్లకు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ 48 గంటల దీక్ష..