ETV Bharat / state

కొవిడ్‌ మృతదేహాల తరలింపులో అయోమయం.. గంటలపాటు తప్పని నిరీక్షణ

రాజధాని పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల పరిధిలో కరోనాతో రోగి చనిపోతే మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడంలో గందరగోళం నెలకొంటుంది. ఎలా తరలించాలన్న అవగాహన పురపాలక అధికారుకులకు లేకుండా పోవడం, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కూడా ఈ వ్యవహారం తమది కాదన్నట్లుగా ఉండడం వల్ల అప్పటికే కొండంత దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబీకులు మరింత కుంగిపోతున్నారు. తాజాగా మణికొండలోని ఓ కాలనీలో ఇదే తరహా ఘటన జరిగింది. కరోనాతో కన్నుమూసిన వ్యక్తిని శ్మశానికి తీసుకెళ్లేందుకు 10 గంటల పాటు ఏ సిబ్బందీ రాలేదు.

Confusion with the evacuation of Kovid dead bodies
సరైన వ్యవస్థ లేక కొవిడ్‌ మృతదేహాల తరలింపులో అయోమయం
author img

By

Published : Jun 27, 2020, 10:04 AM IST

మణికొండ పురపాలక సంఘం అల్కాపూర్‌ కాలనీలో గురువారం ఉదయం కరోనాతో ఓ వృద్ధుడు చనిపోయారు. కుటుంబీకులు పురపాలక, వైద్యారోగ్య శాఖ అధికారులతో పాటు తెలిసిన వారందరికీ ఫోన్‌ చేసి మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించేందుకు తోడ్పాటు అందించాలని వేడుకున్నారు. సాయంత్రం వరకు ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆ బాధ్యత తమది కాదంటూ పురపాలక సిబ్బంది కొన్ని గంటల పాటు అటు వెళ్లలేదు. తామూ ఏమీ చేయలేమని, ఉన్న సిబ్బందిలో కొందరికి వైరస్‌ వచ్చిందంటూ వైద్య సిబ్బంది చేతులెత్తేశారు.

ఈ విషయాన్ని కమిషనర్‌ జయంత్‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్​కుమార్‌కు తెలిపి సహాయం చేయమని కోరారు. జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ స్పందించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పంపించారు. మృతదేహాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లి రాత్రి 9 గంటల సమయంలో ఈఎస్‌ఐ శ్మశానవాటికలో దహనం చేశారు. దాదాపు 10 గంటలు కుటుంబీకులు ఆవేదనతో గడిపారు.

ఇప్పటి వరకు మణికొండ పురపాలక సంఘం పరిధిలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడిందని కమిషనర్‌ జయంత్‌ ఈనాడు-ఈటీవీ భారత్​కు తెలిపారు. జీహెచ్‌ఎంసీ తోడ్పాటుతో సమస్యను అధిగమించామని, ఇక ముందు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే పరిస్థితి మిగిలిన పురపాలక సంఘాల్లోనూ ఉంది. అధికారులు స్పందించి సిబ్బందికి ఈ విషయంలో శిక్షణ ఇప్పించాలని, లేనిపక్షంలో మణికొండ తరహాలోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు కోరుతున్నారు.

బల్దియాలో ప్రత్యేక వ్యవస్థ

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇప్పటికే 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 150 మంది వరకు రోగులు చనిపోయారు. మృతదేహాలను తరలించే విషయంలో బల్దియాలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. చనిపోయిన వారిని ఇంటి నుంచి గాని, ఆసుపత్రి శవాగారాల నుంచి శ్మశానాలకు తరలించడానికి కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరికి ప్రైవేటు వ్యక్తులూ తోడ్పాటు అందిస్తున్నారు.

అదే పురపాలక సంఘాలకు వచ్చేసరికి ఈ తరహా వ్యవస్థ లేదు. కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాల్లో అసలే అంతమాత్రంగా సిబ్బంది ఉన్నారు. ఉన్నవారు కరోనా విధుల్లోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. అదీగాక కరోనాతో రోగి చనిపోతే ఎవరు తరలించాలన్న విషయంలో వీరికి, వైద్యారోగ్య అధికారుల మధ్య స్పష్టమైన విభజన లేక మీరంటే మీరే తరలించాలంటూ నెట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌ జిల్లాలో 9 పురపాలక సంఘాల్లో చాలా చోట్ల ఇదే విధమైన పరిస్థితి ఉందని చెబుతున్నారు.

ఇదీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.