ETV Bharat / state

చేగురును సందర్శించిన కలెక్టర్​, సీపీ

కరోనా కేసు వెలుగు చూసిన రంగారెడ్డి జిల్లా చేగురును జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్ సందర్శించారు. వైరస్​ ఎలా సోకిందో విచారణ చేపట్టారు.

collector and cp visit cheguru village in rangareddy district
చేగురును సందర్శించిన కలెక్టర్​, సీపీ
author img

By

Published : Apr 4, 2020, 3:12 AM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పరిధిలోని చేగురును శుక్రవారం జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్ సందర్శించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో మరణించిన నేపథ్యంలో వైరస్ ఇక్కడికి ఎలా వ్యాపించిందన్న దానిపై విచారణ నిర్వహించారు. ఎక్కువ శాతం విదేశీయులు హాజరయ్యే కన్హా శాంతివనం గ్రామ సమీపంలోనే ఉండడం వల్ల అక్కడ విచారణ చేపట్టారు.

లాక్​డౌన్​ మొదలయినప్పటి నుంచి తాము ఎవరికి అనుమతి ఇవ్వడం లేదని నిర్వాహకులు తెలిపారు. అయితే బీహార్ నుంచి రైళ్లలో కన్హా శాంతి వనానికి వచ్చిన వ్యక్తులను అనుమతించకపోవడం వల్ల వారు మృతురాలి ఇంట్లో అద్దెకు ఉన్నట్లు విచారణలో తేలింది. కాగా గ్రామంలో పలువురు అనుమానితులను వాహనంలో క్వారెంటైన్​కు తరలించారు.

చేగురును సందర్శించిన కలెక్టర్​, సీపీ

ఇవీచూడండి: ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.