CM KCR: విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర మహాకుంభ సంప్రోక్షణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలను భక్తులకు కల్పించాలన్నదే కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు క్షేత్రాభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:ప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామిని కలవనున్నారు. సాయంత్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని జీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం వెళ్లనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. దీంతో ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చర్చించేందుకు జీయర్ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. అటు ఫిబ్రవరిలో జీయర్ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: