మనిషి ఆర్థికంగా ఎదిగేందుకు విద్య ఎంతో ఉపయోగపడుతుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శ్రీచైతన్య జూనియర్, డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ పార్టీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం విద్యార్థులకు అన్ని రంగాల్లో అవకాశాలున్నాయని చదువుపై దృష్టిపెట్టి ఉన్నత స్థానంలో నిలవాలని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 600 గురుకుల పాఠశాలలను ప్రవేశ పెట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రిన్సిపల్ శేఖర్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : భార్య కోసం ట్యాంక్‌పై నుంచి దూకిన భర్త