ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్ అమలు చేయడంతో వారికి ఎంతో మేలు జరుగుతుందని చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్-బిజాపూర్ రహదారిపై స్థానిక తెరాస నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ డబ్ల్యూ ఎస్ వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల విద్య, ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కాల యాదయ్య తెలిపారు. అగ్రవర్ణాల వారిలో అనేక మంది పేదలు ఉన్నందువల్లనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస చేవేళ్ళ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సీనియర్ నాయకులు రమణారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ముత్తూట్ చోరీ' కేసులో ఏడుగురి అరెస్టు