రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ వరుస దొంగతనాలకు పాల్పడింది. కుంట్లూరు గ్రామంలో రెండిళ్లను దొంగలు దోచేశారు. 19.5 తులాల బంగారం, 75వేల నగదు అపహరించారు.
స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. గ్యాంగ్‌లో ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు... దొంగల కోసం గాలిస్తున్నారు. చాలారోజుల తరువాత చెడ్డిగ్యాంగ్ వచ్చిందన్న సమాాచారంతో.. శివారు ప్రాంత వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇవీ చూడండి : దర్శనానికి వెళ్తే దొంగలు పడ్డారు..