హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కారులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ సమీపానికి చేరుకోగానే జాతీయ రహదారిపై ఇంజిన్లో మంటలు రేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు ఇద్దరు కారును పక్కకు నిలిపి కిందికు దిగారు. క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. కారు టైర్లు, లోపలి భాగాలు మొత్తం దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. డీజిల్ ట్యాంక్ లీక్ అవడం వల్లే మంటలు రేగినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
కారులో మంటలు... ప్రయాణికులు సురక్షితం - car caught fire due to diesel tank leakage
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధి బుద్వేల్ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై బయటకు దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు.