ETV Bharat / state

మీర్​పేట, ఆదిబట్ల, జల్​పల్లిలో నామినేషన్ల దాఖలు - nominations filed in Adhibatla, jalpalli

రంగారెడ్డి జిల్లా మీర్​పేట, ఆదిబట్ల, జల్​పల్లి పురపాలక పరిధిలో తొలిరోజు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Candidates nominations filed in Adhibatla, jalpalli
మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు
author img

By

Published : Jan 8, 2020, 9:16 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికలకు అభ్యర్థులు తొలిరోజు నామపత్రాలు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట కార్పొరేషన్​కు మొదటి రోజు 10 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పత్రాలు సమర్పించినట్లు మీర్‌పేట కమిషనర్ బడుగు సుమన్‌రావు వెల్లడించారు. ప్రతి కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని.. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఎన్నికల పర్యవేక్షకులు కేవై నాయక్ మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కేవై నాయక్ వెంట ఆర్డీవో రవీందర్ రెడ్డి ఉన్నారు.

ఆదిబట్ల, జల్​పల్లి మున్సిపాలిటీకి ఈరోజు నామినేషన్లు స్వీకరించారు. ఈ పక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో 5 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 వార్డులు ఉండగా.. 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు.

మీర్​పేట, ఆదిబట్ల, జల్​పల్లిలో నామినేషన్ల దాఖలు

ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!

Intro:hyd_tg_57_29_bollaram_muncipality_visu_vo_TS10056
Lsnraju:9394450162
note బొల్లారం మున్సిపాలిటీ విజువల్

Body:..

Conclusion:...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.