రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. తలసేమియా బాధితుల కోసం రక్తం సేకరించేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు నిర్వహించినట్లు వెల్లడించారు.
ప్రజా సేవాలో భాజపా ప్రథమం
సుమారు వంద మందికి పైగా యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. ప్రజా సేవాకార్యక్రమాలలో భాజపా ఎల్లప్పుడు ముందు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు