రంగారెడ్డి జిల్లా యాచారం ఎంపీపీ సుకన్యను భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు పరామర్శించారు. జిల్లాలోని నందివనపర్తి గ్రామంలో ఫార్మాసిటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సుకన్యని ఆహ్వానించలేదని, అడిగినా ఎమ్మెల్యే పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం వల్ల ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
రంగంలోకి దిగిన పోలులు ఎంపీపీని నెట్టివేశారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ ఎంపీపీ సుకన్య నివాసానికి వెళ్లి మురళీధర్ రావు పరామర్శించారు. ప్రొటోకాల్ పాటించకపోవడమే కాకుండా... దళిత మహిళా ఎంపీపీ పట్ల అధికార పార్టీ ఎమ్మెల్యే వ్వవహరించిన తీరు సరికాదని తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై చర్యలు తీసుకునేంతవరకు భారతీయ జనతా పార్టీ ఎంపీపీ సుకన్యకు అండగా ఉంటుందని అన్నారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'