ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కరోనా వల్ల ఇప్పటికే చాలా నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
కేసీఆర్ ప్రవేశ పెట్టిన నూతన రిజిస్ట్రేషన్ విధానంతో సామాన్యులపై అదనపు భారం పడిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్ గౌడ్, నాయిని సత్యనారాయణ, పోరెడ్డి అర్జున్ రెడ్డి, బాషా, తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం: అగ్రిగోల్డ్ ఛైర్మన్ సహా ముగ్గురు అరెస్ట్