ETV Bharat / state

రిజిస్ట్రేషన్ల సమస్యపై భాజపా ఆధ్వర్యంలో నిరాహారదీక్ష

ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలంటూ భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎల్బీనగర్​లోని బీఎన్​ రెడ్డినగర్​లో​ నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, కార్పొరేటర్లు ప్రజలను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి విమర్శించారు.

BJP demans tyo solve house registrations in lb nagar division
రిజిస్ట్రేషన్ల సమస్యపై భాజపా ఆధ్వర్యంలో నిరాహారదీక్ష
author img

By

Published : Nov 8, 2020, 3:45 PM IST

హైదరాబాద్​లోని ఎల్బీనగర్​​ పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్​ సమస్యను పరిష్కరించాలంటూ భాజపా నాయకులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఎల్బీనగర్, నాగోల్​ డివిజన్లలో ఉన్న సమస్యలపై కాలనీవాసులతో కలిసి బీఎన్​రెడ్డి నగర్ చౌరస్తాలో దీక్షకు దిగారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ ఇచ్చిన హామీని మర్చిపోయారని రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి విమర్శించారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, కార్పొరేటర్లు ప్రజలను మోసం చేశారని అన్నారు. తెరాస నాయకుల మాటలు విని కాలనీవాసులు విసిగిపోయారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: :ఫిజీషియన్లే నిజమైన హీరోలు: గవర్నర్​ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.