రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు లిక్కర్ పంచుతూ పట్టుబడ్డారు. అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై దాడులకు దిగారు. పోలీస్ స్టేషన్లో భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు.
ఈ దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భాజపా నాయకురాలు డీకే అరుణ మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్