ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ వెంటనే పరిష్కరించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ బస్‌డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. కార్మికులెవరూ ఆధైర్య పడవద్దని... నాలుగు కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భరోసానిచ్చారు. తాము తినే ముద్దను కార్మికులకు పెట్టి కాపాడుకుంటామన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాస రూ.500 కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించిన కోమటిరెడ్డి తెరాసకు పరాజయం ఖాయమన్నారు. కిరాయి డ్రైవర్ల కారణంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎంపీ తెలిపారు.
ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"