బిహార్ నుంచి 225 మంది వలసకూలీలు హైదరాబాద్ వచ్చారు. బిహార్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో తొలివిడత కూలీలు లింగంపల్లిలో దిగారు. వలస కూలీలకు పూలు ఇచ్చి మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, కలెక్టర్ అమాయ్ కుమార్ పుష్పాలతో స్వాగతం చెప్పారు. కూలీలకు పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం స్వాగతం పలికారు.
జిల్లాలకు తరలింపు...
వైద్య పరీక్షల అనంతరం అధికారులు జిల్లాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డికి వలస కూలీలను పంపించారు. జగిత్యాల, సుల్తానాబాద్, సిద్దిపేట, మంచిర్యాలకు వలసకూలీలను తరలించారు. రైలు మిల్లుల్లో పనిచేసేందుకే వలసకూలీలు తరలివచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
ఇవీ చూడండి : మెడికల్ సీట్ల ఫీజు పెంపు సరికాదు: వంశీ చంద్‌రెడ్డి