Bathukamma celebrations At Badangpet: రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మురిసిపోతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ క్రీడా మైదానంలో భాజపా నాయకుడు అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్య రెడ్డి పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలతో కలిసి కావ్య రెడ్డి ఆడిపాడారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కావ్య రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: బిజినెస్‌లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ముఖ్యం: గవర్నర్
కేదార్నాథ్లో భారీ హిమపాతం.. ఒక్కసారిగా విరిగిపడ్డ మంచు పెళ్లలు!