ETV Bharat / state

Hyderabad: జీవితంపై అసంతృప్తి.. హమాలీగా మారిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

Assistant Professor turned into a labor in Hyderabad: మంచి ఉద్యోగం.. బంగారంలా చూసుకునే తల్లిదండ్రులు.. సమస్యలు లేని లైఫ్.. అయినా ఏదో తెలియని అసంతృప్తి. ఆ అసంతృప్తే ఆ అధ్యాపకుణ్ని తన వృత్తిని వదిలి.. ఎవరికీ కనిపించకుండా వెళ్లేలా చేసింది. ఆ వెలితే అసిస్టెంట్ ప్రొఫెసర్​ను హమాలీగా మార్చింది. జీవితంపై అసంతృప్తితో ఎవరికీ చెప్పకుండా మాయమైపోయిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్​ను కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కనిపెట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో చోటుచేసుకుంది.

missing case
missing case
author img

By

Published : Apr 19, 2023, 11:57 AM IST

Updated : Apr 19, 2023, 12:41 PM IST

Assistant Professor turned into a labor in Hyderabad: అతను ఓ ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కళాశాలలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పని చేస్తున్నాడు. బంగారం లాంటి కుటుంబం.. గౌరవాన్ని ఇచ్చే వృత్తి. సమస్యలు లేని జీవితం. అంతా సాఫీగా సాగిపోతోంది. అయినా ఏదో తెలియని వెలితి. ఎందుకో జీవితమంటే అసంతృప్తి. ఆ వెలితి తన జీవితంలో మార్పును కోరుకునేలా చేసింది. అంతే ఉన్నపళంగా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలి.. ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన అతను హమాలీగా మారాడు. అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఇంజినీరింగ్​ కాలేజ్​లో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పని చేస్తున్నాడు. ఖమ్మం దూరాభారం కావడంతో అక్కడి నుంచి రాలేక కళాశాలకు దగ్గరలోని వసతి గృహంలో అద్దెకు ఉంటున్నాడు. అందరితోనూ బాగానే కలసిమెలసి ఉంటున్నా.. ఈ నెల 7వ తేదీన ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని జాడ ఎవరికి తెలియకపోవడంతో.. హాస్టల్​ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కుటుంబీకులు వారికి తెలిసిన ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో.. ఈ నెల 17న అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

వెంటనే విచారణను ప్రారంభించిన పోలీసులు వారికి అనుమానం వచ్చిన అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ఇన్​స్పెక్టర్​ స్వామి ఆదేశాలతో ఎస్​ఐ సునీల్​కుమర్​ బృందం రంగంలోకి దిగి.. యువకుడి కుటుంబ సభ్యులు, వసతి గృహంలో ఉన్న తన రూమ్​మేట్స్​, విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గతంలో కూడా ఇలానే ఆ యువకుడు ఇంటిని నుంచి బయటకు వెళ్లి కూలి పనులు చేసే వాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును కొనసాగించారు. అబ్దుల్లాపూర్​మెట్​ మండలంలోని పండ్ల మార్కెట్​ ప్రాంతంలో ఆ యువకుడు ఉండే అవకాశం ఉందని భావించి నిఘా పెట్టారు. మంగళవారం తెల్లవారుజామున మార్కెట్​కు పనుల కోసం వచ్చే వారిపై కన్నేశారు. పోలీసులు ఊహించినట్లుగానే అతను మార్కెట్​లోని హమాలీ పనుల కోసం వచ్చాడు.

12 గంటల్లో కేసు చేధన: అక్కడ ఓ షాప్​లో పని చేస్తుండడం చూసి.. గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తంతును పోలీసులు 12 గంటల్లోనే చేధించి.. ఈ కథ సుఖాంతం చేశారు. అతడిని ప్రశ్నించిన పోలీసులు.. జీవితంపై అసంతృప్తితోనే తాను ఇలా చేసినట్లు తెలిపాడు. అతడిని వెంటనే కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 19, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.