జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక ఓటర్లు ఉన్న మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో ప్రధాన పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. డివిజన్ నుంచి గతంలో కార్పొరేటర్‌గా విజయం సాధించిన తోకల శ్రీనివాస్ రెడ్డి... ప్రస్తుతం భాజపా తీర్థం పుచ్చుకుని పోటీలో ఉన్నారు.
తెరాస అభ్యర్థి ప్రేమ్‌దాస్ గౌడ్ గతంలో కౌన్సిలర్, తెదేపా నుంచి కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవంతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిని చవిచూసిన సానం శ్రీనివాస్ గౌడ్ మళ్లీ అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఈసారి ప్రజలు తనను గెలిపిస్తారనే ఆశాభావంతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
గత కార్పొరేటర్ భాజపా అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిపై ప్రజల్లో నమ్మకం కోల్పోయారని తాను చేసిన అభివృద్ధి... పనులే కనిపిస్తున్నాయని ప్రజలు తనకే బ్రహ్మరథం పడుతున్నారని గెలుపు తనదేననని తెరాస అభ్యర్థి ప్రేమ్‌దాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: మోదీ పర్యటన గురించి నాకు సమాచారమివ్వలేదు: రేవంత్