రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ రోహిణి నక్షత్రం కావడం వల్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు. అక్షయ తృతీయ రోజు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని, గోశాలలో గోవులకు నైవేద్యంతో పాటు పేద బాలికలకు ఒక గ్రాము బంగారం, నిండుగా ఉన్న నీటి కుండను ఇవ్వాల్సిన రోజని ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ వివరించారు. బంగారు దుకాణాల యాజమానులు అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అదృష్టమని, అక్షయ తృతీయకు బంగారానికి ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'విద్యార్థుల ఆత్మహత్యలు వదిలేసి కేరళలో కేసీఆర్'