రంగారెడ్డి జిల్లా ఉస్మాన్ నగర్‌లో 'అక్బర్ ఓవైసీ' ఫ్రీ మెగా ఆరోగ్య శిబిరాన్ని చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని ముంపునకు గురైన అన్ని ప్రాంతాల వారి కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశారు. సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈఆరోగ్య శిబిరంలో ఉచిత పరీక్షలు చేసి, మందులు అందిస్తున్నారు. ప్రజలు భారీగా హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, మున్సిపాలిటీ ఎంఐఎం పార్టీ ఇంఛార్జ్ అహ్మద్ సాది, కౌన్సిలర్లు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పాతబస్తీలో పారిశుద్ధ్యం, పైవంతెనలు, కాలిబాటలు లేవు'