ETV Bharat / state

BEE KEEPING: అమెరికాలో సాఫ్ట్​వేర్‌ ఉద్యోగం వదిలి.. తేనె ఉత్పత్తి రంగంలోకి.. - హైదరాబాద్‌ ప్రజలకు స్వచ్ఛమైన తేనె అందిస్తున్న అనూష

తేనె ఎప్పుడూ.. ఒకే రంగు, రుచిలో ఉండదు. తేనెటీగ రకం, అది మకరందం సేకరించే పూలపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? మరైతే.. మార్కెట్‌లో దొరికే తేనెలు ఎప్పుడూ ఒకే రంగులో ఉంటాయెందుకనేగా మీ అనుమానం. అందుకు కారణం... కల్తీనే అంటోంది హైదరాబాద్‌కు చెందిన అనూష. శాస్త్రీయ పద్ధతుల్లో తేనె ఉత్పత్తి చేస్తున్న ఈ యువతి.. నగర ప్రజలకు స్వచ్ఛమైన తేనె అందిస్తూ, మన్ననలు అందుకుంటోంది.

BEE KEEPING: అమెరికాలో సాఫ్ట్​వేర్‌ ఉద్యోగం వదిలి.. తేనె ఉత్పత్తి రంగంలోకి..

author img

By

Published : Sep 13, 2021, 10:10 AM IST

BEE KEEPING: అమెరికాలో సాఫ్ట్​వేర్‌ ఉద్యోగం వదిలి.. తేనె ఉత్పత్తి రంగంలోకి..

కొంతకాలంగా వ్యవసాయ అనుబంధ రంగాల వైపు యువత అడుగులు వేస్తోంది. తమ సామర్థ్యం, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని.. వివిధ విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఆ జాబితాలోనే నల్లొండకు చెందిన జోకుడి అనూష అనే ఓ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైతం శాస్త్రీయ పద్ధతుల్లో తేనె ఉత్పత్తి చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

కొవిడ్​ సమయంలోనే..

ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ వర్సిటీ నుంచి ఎంఎస్​ పూర్తి చేసిన అనూష.. అమెరికాలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌లో పని చేసేది. 2019లో భర్త సుమన్‌తో కలిసి వీసా కోసం భారత్‌ వచ్చేసింది. ఆ సమయంలోనే కొవిడ్‌ విశ్వరూపంతో భార్యాభర్తలిద్దరూ ఇక్కడే ఉండి పోయారు. భవిష్యత్‌ ప్రణాళికలు రచించుకున్నారు.

స్వచ్ఛమైన తేనె అందించాలని..

కొవిడ్‌ సమయంలో అన్ని చోట్లా ఆయుర్వేద వైద్యమే. తేనె వినియోగమూ భారీగా పెరగడంతో.. కల్తీమాఫియా రెచ్చిపోతోంది. మార్కెట్‌లో నాణ్యమైన తేనె లభించడమే గగనంగా మారింది. ఇది గమనించిన అనూష... నగర ప్రజలకు స్వచ్ఛమైన తేనె అందించాలని నిర్ణయించుకుంది.

తొలుత 5పెట్టెలతో..

శాస్త్రీయ పద్ధతుల్లో తేనె సాగుకు సంకల్పించిన ఈ యువతి.. భాగ్యనగరంలోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థలో శిక్షణ తీసుకుంది. తొలుత 40 వేలతో 5 పెట్టెలతో రంగారెడ్డి జిల్లా యాచారం అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టింది. మంచి ఫలితాలు రావడంతో.. 20 లక్షలతో పెద్ద మొత్తంలో తేనె ఉత్పత్తి ప్రారంభించారు.

ప్రత్యేక బ్రాండ్​ సృష్టించి..

సహజ సిద్ధంగా, విభిన్న రుచుల్లో నెలకు 700 నుంచి 800 కిలోల తేనె ఉత్పత్తి చేస్తున్న అనూష.. ఎల్బీ నగర్‌లో ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే 'బీ ఫ్రెష్​-ప్యూర్​ హనీ' పేరుతో ప్రత్యేక బ్రాండ్‌ సృష్టించి ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తోంది. జంటనగర ప్రజలకు ఉచిత డోర్‌ డెలీవరీ చేస్తుండగా.. 2 తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలకు కొరియర్‌ ద్వారా స్వచ్ఛమైన తేనె చేరువ చేస్తోంది.

పట్టుదలతో అద్భుత ఫలితాలు

వ్యాపార రంగంలో ఏ మాత్రం అనుభవం లేకపోయినా.. స్వయంకృషి, పట్టుదలతో తేనెటీగల పెంపకం, మార్కెటింగ్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తోంది ఈ యువతి. నాణ్యమైన ఉత్పత్తి అందించడంతో ఏడాదిలోపే నెలకు 1.5 నుంచి 2 లక్షల మార్కెట్‌ను సంపాదించి.. పది మందికి ఉపాధి చూపుతోంది. జీవ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే తేనె టీగల పెంపకానికి ఎవరైనా యువత ముందుకొస్తే... బీ-కీపింగ్​పై శిక్షణ ఇస్తానంటోంది అనూష.

ఇదీ చదవండి: MARTYRS MEMORIAL: అద్భుత కట్టడంగా తెలంగాణ అమరవీరుల స్మారకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.