REC A PLUS recognition to TS-WRIDS: రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన మరో కార్పొరేషన్‌కు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ- ఆర్ఈసీ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇటీవల కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఏ కేటగిరీ గుర్తింపు ఇచ్చిన ఆర్ఈసీ... తాజాగా రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ- టీఎస్డబ్ల్యూఆర్ఐడీఎస్కు ఏ ప్లస్ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ను 2018లో ఏర్పాటు చేసింది. సీతారామ, దేవాదుల, కంతనపల్లి, వరద కాల్వ ప్రాజెక్టులు పూర్తి, నిధుల సమీకరణ.. ఈ కార్పొరేషన్ ప్రధాన బాధ్యత. ఇందుకోసం యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆర్ఈసీ, పీఎఫ్‌సీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇక రుణాల ప్రక్రియ సులువు
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్పొరేషన్.. కంతనపల్లి ప్రాజెక్టును 99 శాతం, వరదకాల్వ, దేవాదుల ప్రాజెక్టులను 90 శాతం, సీతారామ ఎత్తిపోతలను 50 శాతం పనులు పూర్తి చేసింది. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ పనితీరు, ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకున్న రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏ ప్లస్ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. దీంతో కార్పొరేషన్‌కు రుణాల ప్రక్రియ సులువు కానుంది.
ఇదీ చదవండి: అన్నదాతలకు తప్పని తిప్పలు.. ఖాతాలో సొమ్ము పడక అవస్థలు