Husband killed Wife and Child in Anajpur: రాష్ట్రంలో రోజురోజుకి ఆఘాయిత్యాలు పెరిపోతున్నాయి. ఎక్కడ చూసిన కుటుంబ కలహాలు, లేదా భార్యభర్తల మధ్య అనుమానాలతో అనేక గొడవలు మనం చూస్తున్నాం. కొంత మంది అయితే చిన్న చిన్న మనస్పర్ధలతో వారి సంసార జీవితాన్ని ఆగాం చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పిన తాను చెప్పిందే జరగాలని ముర్ఖంగా ప్రవర్తిస్తారు. వారికి వచ్చే చిన్న చిన్న గొడవల్ని భూతద్ధంలో వేసి చూస్తారు.
దాని వల్ల వారి జీవితమే చేడు మార్గంలో వెళ్తుందని.., ఎందుకు ఆలోచించరో అర్ధం కాదు. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం ఎంచుకున్న లైఫ్ పార్ట్నర్ని ఎందుకు నమ్మలేక పోతున్నామో అని ఒక్క క్షణం ఆలోచించలేక పోతున్నారు. మనం ఎంచుకున్న జీవిత భాగస్వామిలో మనం ఎందుకు మంచిని చూడలేక పోతున్నామో.. అర్ధం కాదు. అలా చూడకపోతే ముందు ముందు ఎదుర్కొవల్సిన కష్టాలు చాలానే ఉంటాయి.
Murder at Anajpur: దీనివల్ల మనం ఒకొక్కసారి జీవితాన్నే కొల్పోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద వాళ్లు చెబుతూ ఉంటారు.. ఏదైనా చేయ్యాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయ్యాలని. అలా తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనమే బాధపడాలి. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లావణ్యను.. ఆమె పొత్తిళ్లలో ఉన్న శిశువుని భర్త ధనరాజ్ హత్య చేశాడు. భార్య లావణ్యని గొడ్డలితో నరికి చంపి.. తర్వాత తన గుండెలపైన ఆడుకోవాల్సిన.. అభం శుభం తెలియని మూడు నెలల పసికందుని నీళ్ల సంపులో వేసి హతమార్చాడు. హత్యకి పాల్పడిన ధనరాజ్ ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ రావిరాలకు చెందిన లావణ్య, అనాజ్‌పూర్‌కి చెందిన ధనరాజ్‌కి 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
బాలింతగా ఉన్న లావణ్యను బుధవారం మధ్యాహ్నం తన పుట్టింటి నుంచి నిద్ర చేయడం కోసం భర్త ధనరాజ్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన కాసేపటికే భార్య లావణ్యతో గొడవపడిన భర్త ధనరాజ్ ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత మూడు నెలల పసికందుని సంపులో పడేసి హతమార్చాడు. తల్లితో గొడవకు దిగిన తండ్రిని చూసి భయపడిన మూడేళ్ల కుమార్తె ఆద్య ఇంటి నుంచి పారిపోయి తన ప్రాణాలు దక్కించుకుంది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాలతోనే భర్త ధనరాజ్ భార్య, శిశువును హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: