ETV Bharat / state

ఏంటీ..? ఇది గోడ కాదా.. ఇల్లా..? భలే ఉందే..!

House like a Wall : సాధారణంగా ఓ సింగిల్​ బెడ్​రూం ఇల్లు నిర్మించాలంటే 100 గజాల స్థలం ఉండాలి. చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం 60 గజాల స్థలమైనా కావాలి. కానీ కేవలం 8.8 గజాల స్థలంలోనే ఓ వ్యక్తి ఇల్లు కట్టేశాడు. అదీ రెండంతస్తుల భవనం. అంతేకాదండోయ్.. ఆ భవనాన్ని అద్దెకూ ఇచ్చాడు. ఎక్కడంటారా..?

House like a Wall
ప్రహరీలా కనిపిస్తున్నా.. ఇది రెండతస్తుల ఇల్లు
author img

By

Published : Nov 26, 2022, 11:46 AM IST

House like a Wall : హైదరాబాద్‌ మహా నగరంలో భూమి విలువ బంగారమైంది. గజం స్థలం రూ.లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో ప్రతి గజాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థల యజమానులు ఆలోచిస్తుంటారు. అందుకు అద్దం పడుతోంది ఈ భవనం. ఓ పక్క నుంచి చూడడానికి ప్రహరీలా కనిపిస్తున్నా.. ఇది రెండంతస్తుల ఇల్లు. నగర శివారు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరులో ఓ వ్యక్తి తన స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించగా.. 8.8 గజాల స్థలం మిగిలింది.

ముందుభాగంలో వెడల్పు 6 అడుగులు, వెనుకకు వెళ్లే సరికి 2 అడుగులు, పొడవు 20 అడుగులతో ఉన్న ఈ స్థలంలో రెండంతస్తుల భవనం నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చిన్నపాటి కార్యాలయం, పైన అటాచ్డ్‌ బాత్రూంతో రూం కట్టి అద్దెకిచ్చారు.

...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.