పంటలు చేతికివచ్చే సమయంలో పక్షులు, అడవి పందులు, ఇతర జంతువుల నుంచి రక్షించుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు పొలాల్లోనే కాపలా ఉండాల్సి ఉంటుంది. ఏదోఒక అలజడి లేకుంటే పక్షులు గుంపులుగా పొలంలో పడుతుంటాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన రైతు కొమురయ్య వినూత్నంగా ఆలోచించారు.
విద్యుత్ అవసరం లేకుండా.. శబ్దం చేసే పరికరాన్ని రూపొందించారు. గాలికి తిరిగేలా ఓ చిన్న ఫ్యాన్‌ని ఏర్పాటు చేసి.. ఈ ఫ్యాన్ తిరిగినప్పుడు దానికి అనుసంధానం చేసిన ఇనుప గొలుసు స్టీల్ పళ్లేనికి తగిలి చప్పుడు చేయడం దీని ప్రత్యేకత. ఆ శబ్దానికి పక్షులు, జంతువులు రావడంలేదని కొమురయ్య తెలిపారు.
ఇదీ చదవండి:కోటిన్నర మొక్కలు నాటే ఛాలెంజ్‌కు మహేశ్ బాబు మద్దతు