ETV Bharat / state

Sri Ramanuja millennium celebrations : వైభవంగా శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

Sri Ramanuja millennium celebrations : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లోని శ్రీరామనగరానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొనడానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ ఉత్సవాల్లో 11వ రోజైన నేడు అష్టాక్షరీ మహా మంత్రి జపంతో పూజలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం లక్ష్మీనారాయణ మహాయాగం నిర్వహించనున్నారు.

Sri Ramanuja millennium celebrations
Sri Ramanuja millennium celebrations
author img

By

Published : Feb 12, 2022, 11:12 AM IST

వైభవంగా 11వరోజు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

Sri Ramanuja millennium celebrations : శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు 11వ రోజు వైభవంగా సాగుతున్నాయి. రంగారెడ్డి ముచ్చింతల్‌లో ఉదయం అష్టాక్షరీ మహామంత్ర జపంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామనగరంలో జరుగుతున్న నిత్యపూజలు, యాగాలకు దేశం నలుమూలల నుంచి స్వామీజీలు, పీఠాధిపతులు వచ్చారు.

Statue Of Equality : సమతామూర్తి కేంద్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సాయంత్రం నిర్వహించే లక్ష్మీనారాయణ మహాయాగంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. భీష్మఏకాదశి సందర్భంగా 114 యాగశాలల చుట్టూ చినజీయర్ స్వామి అధ్వర్యంలో రుత్వికులు ప్రదక్షిణ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.