రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ అనిల్ తెలిపారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి గాయత్రి పంపు ద్వారా గత పది రోజులుగా నిరంతరాయంగా నీటిని తరలిస్తుండటం వల్ల మధ్య మానేరులో నీరు 15టీఎంసీలకు చేరింది. ఇటీవల శ్రీ రాజరాజేశ్వర జలాశయంగా పేరు మార్చిన మధ్య మానేరు జలాశయం పూర్తి నిల్వ సామర్ద్యం 25టీఎంసీలుగా ఉంది. ఇప్పటికే ఏకధాటిగా నీరు తరలిస్తుండటం వల్ల దిగువ మానేరు జలాశయానికి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని చీఫ్ ఇంజనీర్ అనిల్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇవీ చూడండి : పంపకాలకు వేళాయే... తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల ఇలా!