రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల దర్శనార్థం స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి... ఊరేగింపుగా ప్రధాన కూడళ్లలో శోభా యాత్ర చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాత్రివేళ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య