రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో 22 రోజుల హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీలో 50 లక్షల 78 వేల నగదు అందగా... 57 గ్రాముల బంగారం, 3 కిలోల 580 గ్రాముల వెండి కానుకలను భక్తులు సమర్పించుకున్నారు.
హుండీ డబ్బులు లెక్కింపు కోసం ఆలయ ప్రాంగణంలోని ఓపెన్ స్లాబ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియను ఆలయ ఇవో కృష్ణ ప్రసాద్ పర్యవేక్షించారు.