తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారు. పౌరసత్వం వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేనితో పాటు.. ఆయనపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్ అభ్యంతరాలను పరిశీలించి మళ్లీ నిర్ణయం తీసుకోవాలని ఆ తీర్పులో కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో పౌరసత్వానికి సంబంధించి తాను తప్పుడు వివరాలు పేర్కొన్నారని... దానివల్ల ప్రతికూల ప్రభావం చూపుతుందని చెన్నమనేని తరఫు న్యాయవాది వాదించారు. అనుకూలంగా వచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయడమేంటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తీర్పుల్లో ఏదైనా తప్పుగా ప్రస్తావిస్తే.. సవరించాలని అదే కోర్టును కోరవచ్చునని అప్పటి వరకు గడువు పొడిగించమని కూడా కోరవచ్చునని సూచించింది. ఈమేరకు తన అప్పీలును చెన్నమనేని ఉపసంహరించుకున్నారు.
హైకోర్టులో అప్పీల్‌ను ఉపసంహరించుకున్న చెన్నమనేని - vemulawada mla
పౌరసత్వం వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఉపసంహరించుకున్నారు. అనుకూలంగా తీర్పువచ్చినా అప్పీలు చేయడమేంటని ధర్మాసనం ప్రశ్నించడం వల్ల తన అప్పీలును వెనక్కి తీసుకున్నారు.