వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం నందు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. మంగళ వాయిద్యాలు, సుప్రభాతం, పల్లకి సేవ తదితర పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారంలో పూజలు నిర్వహించిన అనంతరం... స్వామివార్లను అంబారి సేవపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయం ముందు భాగంలో వైకుంఠ ఏకాదశి విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు.
ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు