రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన తెరాస కార్యకర్త జంగపల్లి శ్రీనివాస్ ఇటీవల కురిసిన వర్షాలకు సిద్ధిపేట జిల్లా దర్గపల్లి వాగులో గల్లంతై మృతి చెందాడు. శ్రీనివాస్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి సాయం చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస బీసీ సెల్ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్ రూ.50వేల ఆర్థిక సహాయం చేశారు. మృతుడి పిల్లలైన కృతిక, లాస్యల పేరు మీద బ్యాంకులో రూ.50వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన బాండ్ పేపర్లను మృతుడి భార్య మానసకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజన్న, సింగిల్ విండో ఉపాధ్యక్షులు వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి