ETV Bharat / state

వర్షాలకు కోళ్ల ఫారం షెడ్డు కూలి 3 వేల కోళ్లు మృతి - వర్షానికి షెడ్డు కూలి కోళ్ల మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఓ కోళ్ల ఫారం షెడ్డు కూలి 3 వేల కోళ్లు మృతి చెందాయి. పలు ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

Three thousand chickens were killed by a shed laborer in Rajanna Sircilla district

author img

By

Published : Jun 5, 2021, 10:48 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి.. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన నేలకంటి సతీశ్​ అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారం షెడ్డు నేల వాలింది. సుమారు 5 వేల కోళ్లకు సరిపడే షెడ్డు ఈదురు గాలులకు కూలిపోయింది. షెడ్డులో ఉన్న 3 వేలకు పైగా కోళ్లు మృతి చెందటంతో పాటు, సుమారు 15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.

భారీ వర్షాల వల్ల మండలంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతన్నలు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.