రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ భాష పాల్గొన్నారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థుల కలిసి ముందుకు సాగాలన్నారు. ప్రణాళికలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే డైల్ యువర్ కలెక్టర్ నెంబర్ 6309141122కు సమాచారం ఇవ్వలన్నారు.
ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్లో నలుగురు దొంగల అరెస్ట్