రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు లైన్లలో బారులు తీరారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆర్జిత సేవలను రద్దుపరిచి.. శీఘ్ర దర్శనాలను అమలుపరిచారు. దర్శనాల అనంతరం భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: దేవుడి గోడు వినేవారు ఎవరు?