ETV Bharat / state

రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఆలయానికొచ్చే భక్తులకు హై టెంపరేచర్ యంత్రంతో స్కానింగ్ చేసిన తర్వాతనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.

CORONA SCANNING
రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​
author img

By

Published : Mar 18, 2020, 10:46 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు ఆలయాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో థర్మల్​ స్కానింగ్​ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఎప్పటికప్పుడు రసాయనాలతో శుద్ధి చేస్తున్నారు.

స్వామివారి దర్శనానికొచ్చే భక్తులను థర్మల్​ స్కానింగ్​ ద్వారా తనిఖీ చేసిన తర్వాతనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో వైరస్ పట్ల అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన లౌడు స్పీకర్ల ద్వారా కూడా​ భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆలయ సిబ్బంది వివరిస్తున్నారు.

రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​

ఇదీ చూడండి: త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.