ETV Bharat / state

చలిలో రోడ్డెక్కిన విద్యార్థినులు.. ఆ ముగ్గురిని సస్పెండ్​ చేయాలని డిమాండ్ - విద్యార్థినుల ధర్నా

Ekalavya Model Residential School Students Concern: స్కూల్​లో సమస్యలు ఉన్నాయని చెబితే సిబ్బంది అసలు స్పందించడంలేదని.. అందుకే నిరసన తెలుపుతున్నామని ఓ రెసిడెన్షియల్​ పాఠశాల విద్యార్థినులు వాపోయారు. వెంటనే వారిని సస్పెండ్​ చేయాలని ఆందోళనలు చేశారు. ఈ సమస్యలు పరిష్కరించే వరకు తాము పోరాటం ఆపమని సూచించారు.

Students Concern
విద్యార్థుల ధర్నా
author img

By

Published : Jan 8, 2023, 11:55 AM IST

Ekalavya Model Residential School Students Concern: స్కూల్​ సిబ్బంది తమను వేధిస్తున్నారని.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట కేంద్రం ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపించి.. తెల్లవారుజామున 5 గంటలకే దాదాపు 50 మంది విద్యార్థినులు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

తక్షణమే వారిని విధుల నుంచి బహిష్కరించాలని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన చేపట్టారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. తమకు న్యాయం జరిగినంత వరకు ఇక్కడినుంచి కదిలేది లేదంటూ చలిలో విద్యార్థినులు భీష్మించుకుని కూర్చున్నారు.

భోజనం చేసేటప్పుడు చారులో వానపాములు కనిపించాయని చూపించినా.. వార్డెన్​ పట్టించుకోలేదని విద్యార్థినులు తెలిపారు. ఈ విషయాలపై ప్రిన్సిపాల్​కి చెప్పడానికి వెళితే.. కనీసం తమవైపు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్​ ఖర్చులకు గవర్నమెంట్​ వేసిన డబ్బును ఖర్చుపెట్టలేదని చెప్పారు. ఎటువంటి క్రీడలకు ఆమె డబ్బును అసలు ఖర్చుచేయడం లేదని ఆరోపించారు. వార్డెన్​ రాత్రి సమయంలో ఆల్కాహాల్​ సేవించి.. వచ్చి తమను దుర్భాషలు ఆడేవాడని వాపోయారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

"ప్రిన్సిపాల్​ ఏ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. పై అధికారులకు ఫిర్యాదు చేసిన వారు అదే విధంగా మాట్లాడుతున్నారు. వార్డెన్​ అసలు ఎటువంటి సమస్యలు చెప్పిన వినిపించుకోదు. సాంబారులో వానపాములు వస్తున్నాయి అంటే ఇది ఏమైనా వర్షాకాలమా అన్నారు. వార్డెన్​ రోజూ ఆల్కహాల్ సేవిస్తూ దురుసుగా మాట్లాడతాడు. వీరి ముగ్గురిని ఇక్కడి నుంచి సస్పెండ్​ చేసే వరకు మేము ఈ నిరసన ఆపబోం." -విద్యార్థినులు​

ఏకలవ్య మోడల్​ రెసిడెన్సియల్​ స్కూల్​ విద్యార్థుల నిరసన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.