ETV Bharat / state

KTR TWEET : మిడ్​మానేరు అందాలు.. పర్యాటకానికి ప్రణాళికలు - Mid Manair drone visuals

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్యామ్​లు, ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్​ మానేరు(శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్) బ్యాక్ వాటర్​తో కళకళలాడుతోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

మిడ్​మానేరు అందాలు
మిడ్​మానేరు అందాలు
author img

By

Published : Jul 13, 2021, 10:34 AM IST

రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్యామ్​లు, రిజర్వాయర్​లు నిండుకుండలా మారుతున్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్​ మానేరు(శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్) జలకళను సంతరించుకుంది. బ్యాక్​ వాటర్​తో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

మిడ్ మానేర్ బ్యాక్ వాటర్​తో.. ఆ ప్రాంతమంతా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇప్పటినుంచి అధికారికంగా ఇది వాటర్ జంక్షన్​. ఈ ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తాం. దానికోసం రాష్ట్ర పర్యాటక సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వానలకు వాగులు, వంకలు, చెరువులు, రిజర్వాయర్​లు నిండుకుండలా మారాయని తెలిపారు. వీటిని చూడటానికి పెద్దఎత్తున పర్యాటకులు తరలివెళ్తున్నారని చెప్పారు. సందర్శకుల కోసం అధికారులు అన్ని రకాలు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. వాగులు, చెరువుల వద్ద పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెల్ఫీల కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దన్నారు.

జలపాతాలు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లేవారు కరోనా నిబంధనలు తప్పకపాటించాలని కేటీఆర్ సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించాలని చెప్పారు. పర్యాటకుల భద్రత.. పోలీసులు, అధికారుల బాధ్యత అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.