వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. నిర్మల్ పట్టణం శాస్త్రినగర్లోని ఆయన నివాసంలో దేవస్థాన ఈవో కృష్ణ ప్రసాద్ ఆహ్వాన పత్రికను అందించారు. తొలుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వేదపండితులు ఆశీర్వదించి... ప్రసాదాలను అందజేశారు. అనంతరం శివరాత్రి వేడుకలకు హాజరుకావాలని కోరారు.
ఇదీ చదవండి: యోగా చిచ్చర పిడుగులు