రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ ప్రధాన ద్వారం వద్దే పాము ఉండడంతో అధికారులు, భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. పాము ఒక్కసారిగా పెద్దగా పడగ విప్పడంతో కొంత మంది భక్తులు దైవ మహిమ అంటూ దండాలు పెట్టుకున్నారు. చాలా సేపటి వరకు ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లకుండా ఆగిపోయారు.
దీంతో ఆలయ అధికారులు పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. వెంటనే అతను వచ్చి పామును పట్టుకోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. పాములు పట్టే వ్యక్తి చేతికి తొడుగులు పెట్టుకొని పామును పట్టుకున్నారు. పదే పదే అతని చేతికి సర్పం కాటు వేసేందుకు యత్నించింది. అతని చేతులకు తొడుగులు ఉండటం వల్ల ఎలాంటి అపాయం జరగలేదు. అనంతరం పామును ఆలయం బయట వదిలిపెట్టారు. పాము ఆలయంలోకి రావడంతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: Group-1 Notification: గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల