ETV Bharat / state

ఔరా! అనిపిస్తున్న చేనేత వెండి చీర.. ధర ఎంతో తెలుసా? - సిరిసిల్ల వెండి సిరి చందనం చేనే చీర

Handloom Silver Saree Made By Sirisilla handloom: రాజన్న సిరిసిల్ల అంటేనే గుర్తుకు వచ్చేది.. మగ్గంపై నేచిన అందమైన చీరలు.. అందరి కంటే భిన్నంగా రకరకాల డిజైన్స్​తో ఎంతో నేర్పుతో చీరలను నేస్తారు. ఈ మధ్య సిరిసిల్ల మగ్గం చీరలకు సిరి చందనం పట్టు చీరలుగా ప్రపంచం వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అలాగే మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. యువ చేనేత కార్మికుడు నేసిన వెండి చీర అందరినీ ఆకట్టుకుంటుంది. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం

Sirisilla
రాజన్న సిరిసిల్ల
author img

By

Published : Jan 6, 2023, 3:08 PM IST

Handloom Silver Saree Made By Sirisilla handloom: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన యువ చేనేత కార్మికుడు మగ్గంపై వెండి చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్.. చేనేత చీరల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ మధ్యనే సిరి చందనం పట్టుగా సిరిసిల్ల చీరలకు పేరు రావడానికి కారణమయ్యాడు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ.. నేడు చేనేతకే అందం తెచ్చేలా వెండి చీరను మగ్గంపై నేశాడు.

సిరి చందనం పట్టుగా సిరిసిల్ల చీరకు గుర్తింపు రావడంతో.. ఆ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, తల్లి జ్యోతి సిరి చందనం పట్టు చీరతో పూర్తిగా వెండి దారాలతో చీర కావాలని కోరారు. ఆమె కోరిక మేరకు సిరి చందనంకు వచ్చిన గుర్తింపు మేరకు.. అదే స్ఫూర్తితో వెండి చీరను నేశారు. ఈ చీరను నెల పది రోజుల శ్రమించి రూపొందించడం జరిగిందని విజయ్ తెలిపారు.

ఈ చీరకు 90 గ్రాముల వెండిని కలపడం జరిగిందన్నాడు. గతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన విజయ్​ ఈ ప్రయోగంతో మరోసారి సిరిసిల్లఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ చీర 600 గ్రాములు ఐదున్నర మీటర్ల 48 ఇంచుల పన్నా నేయడం జరిగిందని, ఈ చీర కోసం రూ. 45,000 వెచ్చించినట్లు ఆయన తెలిపారు.

వెండి చీరను నేసిన చేనేత కార్మికుడు విజయ్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.