ETV Bharat / state

ఇక కార్మికుడే యజమాని.. సిద్ధమవుతున్న సిరిసిల్ల వీవింగ్‌ పార్కు.. - siricilla weaving park

అరకొర సంపాదన... ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే నేత కార్మికులను యజమానులుగా మార్చే ఓ పథకం సాకారం దిశగా పురోగమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఓ పార్కునే నెలకొల్పుతోంది. తొలిసారిగా సిరిసిల్లలో అమలు కాబోతున్న ఈ పథకం విజయవంతమైతే ఇతర జిల్లాలకూ విస్తరించాలనేది ప్రణాళిక.

siricilla weaving park is under construction

author img

By

Published : Mar 19, 2022, 7:19 AM IST

వస్త్ర పరిశ్రమలోని కార్మికుల ఉపాధి భద్రత కోసం ప్రభుత్వం వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని రూపొందించింది. దీనికి రూ.220 కోట్లు కేటాయించి, 2017 అక్టోబరు 11న ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేశారు. అయిదు వేల మంది కార్మికులను యజమానులుగా మార్చాలనే లక్ష్యంతో సిరిసిల్లలోని పెద్దూరులో 88.03 ఎకరాలను వీవింగ్‌ పార్కుకు కేటాయించారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో షెడ్ల నిర్మాణం, మౌలిక వసతుల పనులు తుది దశలో ఉన్నాయి. ఇటీవల మరమగ్గాల తయారీ కంపెనీ యంత్రాలను తీసుకొచ్చింది. ఎంపికైన కార్మికులకు శిక్షణ త్వరలోనే ప్రారంభం కానుంది.జిల్లాలోని టెక్స్‌టైల్‌ పార్కుతోపాటు పట్టణంలోని పురాతన, సెమీ ఆటోమేటిక్‌ మరమగ్గాలపై వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఓవర్‌ పిక్‌ పద్ధతిలో నడిచే ఈ మగ్గాలపై వస్త్రోత్పత్తిలో వేగం, నాణ్యత లేక జాతీయ విపణిలో డిమాండ్‌ ఉండటం లేదు. ప్రస్తుతం తీసుకొచ్చిన మరమగ్గాలు 4/1 సెమీ ఆటోమేటిక్‌వి. వీటిపై అండ్‌పిక్‌ పద్ధతిలో ఉత్పత్తి జరుగుతుంది. ఒకేసారి నాలుగు రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల వాటికి నాణ్యత, నవ్యత మెరుగై, మంచి డిమాండ్‌ లభిస్తుంది.

కార్మికుల ఎంపిక

ఈ పథకంలో ఒక్కో కార్మికుడి యూనిట్‌కు రూ.8 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్కరికి నాలుగు మరమగ్గాలు అందజేస్తారు. ఒక్కో షెడ్డులో ఎనిమిది మంది కార్మికుల యూనిట్లుంటాయి. వీటికి అనుబంధంగా నాలుగు వార్పిన్‌ షెడ్లు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయంలో కార్మికుని వాటాగా పది శాతం చెల్లించాలి. 50 శాతం ప్రభుత్వ రాయితీ, 40 శాతం బ్యాంకు రుణంగా అందుతాయి. తొలి విడతగా ఇప్పటికే 1,104 మంది కార్మికులను ఎంపిక చేశారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు నాలుగు మరమగ్గాలు, ఒక వార్పిన్‌ యంత్రాన్ని వీవింగ్‌ పార్కులో బిగిస్తున్నారు.

పథకం స్వరూపం

  • నిధులు : రూ.220 కోట్లు
  • పార్కు విస్తీర్ణం : 88.03 ఎకరాలు
  • మొత్తం వర్క్‌షెడ్లు : 46
  • వార్పిన్‌ షెడ్లు : 04
  • తొలి విడత కార్మికులు : 1104
  • మరమగ్గాలు : 4416

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.