Sircilla Ground water Level: కరవుకు మారుపేరుగా నిలిచిన రాజన్నసిరిసిల్ల జిల్లా ముఖచిత్రమే మారిపోతోంది. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న జల నిర్వహణ విధానాలతో దేశానికే సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటింటికీ ఇంకుడు గుంతలు, ఉపాధిహామీ పనులు, వాటర్ షెడ్ల నిర్మాణం... మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల వేసవిలోనూ భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. కాళేశ్వరంతో చెరువులు నిండువేసవిలోనూ మత్తడి దూకుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో ఆరుమీటర్లకు పైగా భూగర్భజలాలు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కేసీఆర్ దూరదృష్టి వల్లే..
ground water increased in sircilla: భూగర్భజలాల పెరుగుదలకు తీసుకున్న చర్యలు వివరించాలని ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను కోరింది. ఆ మేరకు సమగ్ర వివరాలతో వీడియో చిత్రీకరించి పంపించారు. జలనిర్వహణపై అధ్యయనం కోసం సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దూరదృష్టితో కేసీఆర్ చేపట్టిన జలవిధానాలకు దక్కిన గుర్తింపుగా కొనియాడారు.
'2014కు ముందు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా చెప్పుకునేవాళ్లు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. చేనేతలకు చేతినిండా పనితో మరమగ్గాల సవ్వడి, కళకళలాడుతున్న పంటపొలాలు నిండుకుండల్లాంటి సాగు ప్రాజెక్టులతో ఏడేళ్లలో జిల్లా ముఖచిత్రం మారిపోయింది.' - కొండూరి రవీందర్‌రావు, టెస్కాబ్ ఛైర్మన్
'2016లో కేవలం 30లక్షల చేపపిల్లలు ఆయా చెరువుల్లో విడుదల చేస్తే ప్రస్తుతం ఆ లక్ష్యం కోటి 20లక్షలకు పెరిగింది. మధ్యమానేరులో అక్వాకల్చర్‌తో పాటు కేజ్‌కల్చర్ కోసం ప్రతిపాదనలు సిద్దం చేశారు. సాగునీరు అందుబాటులోకి రావడం, యాంత్రీకరణ,మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడటంతో రైతులు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.' - రణధీర్, సిరిసిల్ల వ్యవసాయాధికారి
గతంలో కరవు కోరల్లో విలవిల్లాడిన సిరిసిల్ల నేడు దేశానికే నీటి పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది.
ఇవీ చూడండి: