72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ సందేశాన్నిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ నేలకొండ అరుణ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.