తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడిని తలపెట్టారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా కండక్టర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇవీ చూడండి: అపార్ట్మెంట్ గొడవలు... బాలుడిపై విచక్షణారహితంగా దాడి..