తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసివేశారు. దేవాలయ అధికారులు సాయంత్రం 4 గంటల సమయంలో తాళాలు వేశారు. రాత్రి ఒంటి గంట 24 నిమిషాల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని అర్చకులు తెలిపారు. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు, మకర రాశుల వారు జపం, దానం చేయడం వలన దోషాలు తొలిగిపోతాయన్నారు. బుధవారం ఉదయం 4 గంటల 32 నిమిషాలకు గ్రహణం వీడిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి మంగళ వాయిద్యాలుతో ప్రాతఃకాల పూజలతో యధావిధిగా ఆలయాన్ని తెరుస్తారు.
ఇవీ చూడండి: ముంబయిలో భవనం కూలి నలుగురు మృతి